calender_icon.png 17 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన జడ్జి

17-01-2026 02:14:06 AM

నాగిరెడ్డిపేట్,జనవరి 16 (విజయ క్రాంతి):సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల మరియు హైదరాబాద్ (ఎన్‌ఐఏ) కోర్టు అడిషనల్ చీఫ్ జడ్జ్ విక్రమ్, మండలంలోని తాండూరు త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు త్రిలింగ రామేశ్వర దేవాలయం అద్భుతమైన నిర్మాణం శైలి కలిగి ఉందని కొనియాడారు.

వారికి ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానం చేసి పండితులచే వేద ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ దత్తు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్, ఎల్లారెడ్డి మెజిస్ట్రేట్ దీప,సుష్మ, ల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి,నాగిరెడ్డిపేట ఎస్త్స్ర భార్గవ్ గౌడ్,నిర్మల్ జిల్లా డి.ఎల్.ఎస్.ఏ.సూపర్డెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.