calender_icon.png 27 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూన్నాళ్ల ముచ్చటే..!

27-08-2025 01:38:59 AM

- లక్షలు ఖర్చు చేసినా ఫలితం శూన్యం

- ధ్వంసమైన సీసీ రోడ్డుతో ఇబ్బందులు

- అధికారులు, కాంట్రాక్టర్ అవినీతికి నిదర్శనం

జహీరాబాద్, ఆగస్టు 26 :రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు అంతర్గత సీసీ రో డ్లను నిర్మించారు. ముఖ్యంగా ప్రజలకు ఇ బ్బందులు ఉన్నచోట సీసీ రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించినా వారి సంకల్పం ఎండమావిగానే మిగిలిపోయింది. జరాసంగం మండ లం కుప్పానగర్ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

లక్షలాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాం ట్రాక్టర్ల అవినీతి వల్ల మూనాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కుప్పానగర్ గ్రా మంలోని చర్చి ముందు నుండి వెళ్లే సీసీ రో డ్డు ధ్వంసమై మట్టి రోడ్డుగా మారింది. సీసీ రోడ్డు నుండి వాహనాలు వెళుతున్న క్రమంలో రోడ్డుపై గుంతలు పడటంతో ప్రజలకు ఇబ్బంది కలిగాయి. ఈ విషయమై సద రు కాంట్రాక్టర్ను విజయక్రాంతి నిలదీయడంతో కాంట్రాక్టర్ అయోమయానికి గుర య్యారు. దీంతో కాంట్రాక్టర్ వెంటనే ఎర్ర మట్టి మొరం తెచ్చి సీసీ రోడ్డుపై వేయించి గుంతలను పూడ్చారు. దీంతో సిసి రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. 

లక్షలాది ప్రజల సొమ్ము వృధా...

జరాసంగం మండలం కుప్పానగర్ గ్రా మంలో లక్షలాది రూపాయలతో పాటు మ హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథ కం గ్రాంట్ ద్వారా సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు నిర్మాణం దశలో, నిర్మించిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదిక అందించిన తర్వాతనే బిల్లు లు మంజూరు చేయాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సదరు అధికారులు కాంట్రాక్ట ర్తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్డు నాణ్యతను పరిశీలించకుండా నే రోడ్డును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రోడ్డు సీసీ రోడ్డా లేక మట్టిరోడ్డా అనేది అనుమానం కలుగుతుంది. ఇప్పటికైనా సంబంధి త అధికారులు స్పందించి సీసీ రోడ్డు నాణ్యతను పరిశీలించి సదరు కాంట్రాక్ట్ప చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.