14-08-2025 10:27:54 PM
- డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
-మోదీ చేసిన మోసాన్ని ప్రతి గడపకు తీసుకెళుతాం
-ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నదని డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి కొవొత్తులను ప్రదర్శించారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో ఓటు హక్కుకు ఎంతో విలువైనదని, అలాంటి ఓటును చోరికి పాల్పడడం దుర్మార్గమని అన్నారు. బెంగుళూర్ సెంట్రల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని తెలిపారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఒక మహాదేవ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల దొంగతనాన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ బయటపెట్టినట్లు తెలిపారు. డిజిటల్ ఓటర్ లిస్టు, సీసీ పుటేజ్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఓట్లు దొంగలించి.. అధికారంలోకి వస్తారా: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
అప్రజాస్వామికంగా ఓట్లు దొంగిలించి అధికారంలోకి వచ్చిన మోదీ చేసిన మోసాన్ని ప్రతి గడపకు తీసుకుపోతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతి ముఖ్యమైనవని, కాని నిర్వహణపైన అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు మలికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ కు ఎన్నో సార్లు వినతులు ఇచ్చినా స్పందించలేదన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు. ర్యాలీలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు వినోద్ కుమార్, చంద్రకుమార్ గౌడ్, ఎన్పీ.వెంకటేశ్, జహీర్ అఖ్తర్. మిథున్ రెడ్డి సిరాజ్ ఖాద్రీ, సీజే బెనహర్, రాఘవేందర్ రాజు, ఆవేజ్, సాయిబాబా, రాములుయాదవ్, ఫయాజ్, అజ్మత్ అలీ,, సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.