calender_icon.png 9 September, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ ఉత్పత్తుల్లో భారీ విజయం

07-08-2024 12:00:00 AM

చలాది పూర్ణచంద్రరావు :

గత ఆర్థ్ధిక సంవత్సరం 2023-24లో భారీగా జరిగిన రక్షణ ఉత్పత్తిలో భారతదేశం గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధిని సాధించింది. ఈ కాలంలో రూ.21,083 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు అంటే సుమారు 2.63 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.

ఈ రకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ బృహత్తర ఆశయ సాధనవైపు దేశం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులను 5 బిలియన్ల యూఎస్ డాలర్లను లక్ష్యంగా నిర్ణయించుకొంది.

కేంద్ర ప్రభుత్వ పథకం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రక్షణరంగ ఉత్పత్తుల రంగం ఎంతో అంకితభావంతో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నది. గత ఆర్థ్ధిక సంవత్సరం 2023---24లో రక్షణ ఉత్పత్తిలో తిరుగులేని విధంగా పెరుగుదల నమోదైంది. ఈ మేరకు మొత్తం ఉత్పత్తి విలువ రూ. 1,26,887 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి విలువకంటే 16.8 శాతం ఎక్కువ.

సుమారు 100 వరకు ప్రభుత్వ, ప్రయివేట్ రక్షణ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఇందులో ఉన్నా యి. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవే ట్ రక్షణ పరికరాల తయారీ పరిశ్రమల కృషి ఫలితంగానే ఈ భారీ ఉత్పత్తులు సాధ్యమయ్యాయి.

 నాడు దిగుమతి.. నేడు ఎగుమతి

ఎనిమిదేళ్ల క్రితం వరకూ భారతదేశం రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండింది. కానీ, ఇప్పుడు 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నది. ఇదంతా ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా సాధించిన ఘనతగానే చెప్పాలి.

ప్రస్తుతం వంద వరకు సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. ఈ రకంగా భారతీయ పరిశ్రమ దేశీయ డిజైన్, అభివృద్ధి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతున్నది. ‘ఏరో ఇండియా 2023’ను 104 దేశాల భాగస్వామ్యంలో నిర్వహించిన సం దర్భంలో, భారతదేశంలో పెరుగుతున్న రక్షణ తయారీ సాంకేతిక సామర్థ్యాలకు ఈ ఉత్పత్తులు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. 

ఈ భారీ విజయం భారతదేశ నైపుణ్య ప్రతిభకు, ‘మేక్ ఇన్ ఇండియా’పట్ల దేశ నాయకత్వానికిగల అంకితభావానికి, ఉత్సాహానికి స్పష్టమై న నిదర్శనమని ఈ సందర్భంగా ప్రధా నమంత్రి నరేం ద్ర మోదీ ఒకానొక సందేశంలో అభివర్ణిం చారు. గత కొన్నేళ్లుగా రక్షణ పరికరాల తయారీ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నా యన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నది. భారత్‌ను ‘రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్’గా మార్చే ప్రయత్నాలకు కేంద్ర ప్రభు త్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కూడా ప్రధాని మోదీ అప్పట్లోనే ప్రకటించారు.

ఎగుమతుల జాబితాలో ‘బ్రహ్మోస్’

భారతదేశం నేడు డోర్నియర్ -228, 155 ఎంఎం అడ్వాన్స్‌టోవెడ్ ఆర్టిలరీ గన్స్ (ఏటీఏజీ), బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ క్షిపణి వ్యవ స్థ, రాడార్లు, సిమ్యులేటర్లు, మైన్ రక్షిత వాహనాలు, సాయుధ వాహనాలు, పినాక రాకెట్లు, -లాంచర్లు, మందుగుండు సామగ్రి, థర్మల్ ఇమేజర్లు, బాడీ ఆర్మర్స్, తత్సంబంధ వ్యవస్థలు, లైన్ రీప్లేసబుల్ యూనిట్లు, ఏవియానిక్స్, స్మాల్ ఆర్మ్స్ భాగాలు, విడిభాగాలు వంటివాటిని మన దేశం ఎగుమతి చేస్తున్నది.

ఎల్‌సీఏ- తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తదితర స్వదేశీ ఉత్పత్తులకు అంత ర్జాతీయంగా పలు దేశాల్లో మంచి డిమాండ్ పెరుగుతున్నది. ప్రపంచంలోనే ప్ర ముఖ రక్షణ తయారీ హబ్‌గా భారతదేశాన్ని నిలబెట్టడానికి, మరిం త సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనేది ప్రధాని మాట ల్లో తిరుగులేని నిర్ణయంగా కనిపిస్తున్నది.

గత ఆర్థ్ధిక సంవత్సరం 2023--24 ఇంత భారీగా జరిగిన రక్షణ ఉత్పత్తిలో భారతదేశం గతంలో ఎప్పుడు లేనంతగా అభివృద్ధిని సాధించింది. ఈ కాలంలో రూ.21,083 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు అంటే సుమారు 2.63 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఈ రకంగా ‘మేక్ ఇన్ ఇండి యా’ బృహత్తర ఆశయ సాధనవైపు దేశం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. కాగా, 2024--25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులను 5 బిలియన్ల యూఎస్ డాలర్లను లక్ష్యంగా నిర్ణయించుకొంది.

దోహదం చేసిన ప్రోత్సాహకాలు

రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడానికి భారతీయ పరిశ్రమలకు అందించిన ఎండ్-టు-ఎండ్ డిజిటల్ సొల్యూషన్ సహా ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన సంస్కరణలు, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాల ఫలితంగా చెప్పుకోతగిన అభివృద్ధి సాధ్యమయిందని చెప్పాలి. ఈ వృద్ధి భారత రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలకు ప్రపంచ ఆమోద యోగ్యతకు ప్రతిబింబంగానూ నిలుస్తున్నాయి.

రక్షణ ఉత్పత్తుల నిరంతర ప్రోత్సాహానికి, పరిశ్రమలను మరింతగా సులభతరం చేయడానికి విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో క్రమం తప్పక కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇండ స్ట్రీ అసోసియేషన్‌ల భాగస్వామ్యం తో మిత్ర దేశాల ప్రతినిధుల (ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్  ఎఫ్‌ఎఫ్‌సీ)తో దృశ్య శ్రవణ విధానం ద్వారా కూడా సమావేశా లు నిర్వహించటం జరుగుతున్నది. మున్ముందు మరింత అనూహ్య వృద్ధిని నమోదు చేసే దిశగా కృషి జరగాలని ఆశిద్దాం.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు

సెల్ : 9491545699