calender_icon.png 9 September, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రైల్వే లైన్లు వేయండి

08-08-2024 12:00:00 AM

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా చాలామందికి రైలు సౌకర్యం ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. పలు రూట్లలో ప్రతిపాదించిన రైల్వే లైన్లకు ఇప్పటికీ మోక్షం లేదు. డిమాండ్ ఉన్న రూట్లలో రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలి. అలాగే, చాలా మార్గా ల్లో కొత్త లైన్లు రావలసిన అవసరాన్ని రైల్వేశాఖ వెంటనే గుర్తించాలి. పలు మార్గాల్లో రైల్వే లైన్లు ఉన్నప్పటికీ ఆ మార్గాల్లో తిరిగే రైళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగని స్టేషన్లు చాలానే ఉన్నాయి. పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్లుగా మరిన్ని రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది.

ఇటీవలి కాలంలో ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గిపోయాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ ప్యాసింజర్ రైళ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. మిగతా రైళ్లలో కూడా జనరల్ బోగీల సంఖ్య తక్కువగానే ఉంటున్నది. ఫలితంగా ఆ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కొత్తగా ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు కానీ, ఇవి కొన్ని రూట్లకే పరిమితవుతున్నాయి. మిగతా మార్గాల్లో కూడా వీటిని నడిపి తే సౌకర్యంగా ఉంటుంది. రైల్వేశాఖకు రానురాను ప్రాధా న్యం తగ్గిపోతున్నదన్న విమర్శలను తిప్పికొట్టేలా సదుపాయాలను మెరుగు పరచాలి.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్