calender_icon.png 30 May, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే ఆమరణ నిరాహారదీక్ష

28-05-2025 03:12:49 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో జారీచేసి.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈ అంశాన్ని కేంద్రపై నెట్టేసి తప్పించుకుంటే 1000 మంది బీసీ నేతలతో కలిసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటాం' అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా  హెచ్చరించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు, బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అమలు ప్రక్రియ పై ముందు కెళ్లాలని కోరారు.

పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తున్నారని, అలాకాకుండా చట్టపరంగా బీసీల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'చలో ఢిల్లీ' నిర్వహించి ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా మని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు మొగిలిచర్ల సత్యనారాయణ, రావులపెంట రాజబాబు, మేకపోతుల వెంకటేశ్వర్లు, పింగిలి వెంకన్న, గండు నారాయణ, రావులపెంట పరుశురాములు, తుమ్మల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.