14-12-2025 12:13:43 AM
భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో దారుణం
రేగొండ/భూపాలపల్లి,డిసెంబర్ 13(విజయక్రాంతి): భార్య, కూతురు వేధింపులు భరిం చలేక భర్త తాళి కట్టిన ఆలిని హత్య చేశాడు. అనంతరం స్థానిక ఎస్‌ఐకి తన వేదన వివరి స్తూ వీడియో విడుదల చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దారుణం భూపాలపల్లి జిల్లా గణ పురం మండలం సీతారాంపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేర కు గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) మొదటి భార్య చనిపోగా సంధ్య(42)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతు రు ఉండగా ఆమెకు పెళ్లి అయి అత్తారింటికి వెళ్లిపోయింది.బాలాజీ రామాచారి అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. భార్యాభర్తల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే శనివారం భార్య సంధ్యను తాడుతో ఉరివేసి చంపి గణపురం ఎస్‌ఐకి తాను పడుతున్న బాధను వివరిస్తూ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని ఆపై తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోష ల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.