calender_icon.png 21 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా ఇంటి ముందు నుంచి వెళ్లొద్దు!

21-12-2025 01:00:11 AM

రోడ్డుపై అడ్డంగా ఎద్దుల బండ్లు..

ఆదిలాబాద్ జిల్లాలో 

చిన్నబుగ్గారంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి భర్త నిర్వాకం

గ్రామస్థులతో గొడవ

అడ్డకునేందుకు వచ్చిన 

పోలీసులపై దాడి

ఆదిలాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాం తి): సర్పంచ్ ఎన్నికల్లో తమకు గ్రామస్థులు ఓటేయకుండా.. ఓటమికి కారణమయ్యారని, వారు తన ఇంటి ముందు నుంచి వెళ్లకుండా సర్పంచ్ అభ్యర్థి భర్త రోడ్డుపై ఎడ్లబండ్లను అడ్డంగా ఉంచాడు. గ్రామస్థులు అభ్యంతరం చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు చేరుకుని, చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారిపై నా రాయితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చిన్నబుగ్గారంలో శనివారం జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు మహిళా అభ్యర్థులు సర్పంచ్ కోసం పోటీ చేశారు. అందులో ఓడిపోయిన ఓ అభ్యర్థి భర్త మోహన్.. గ్రామస్థుల్లో కొంద రు తనకు ఓటు వేయలేదనే అక్కసుతో తన ఇంటి ముందు ఉన్న రోడ్డు గుండా నడవకుండా ఎడ్లబండ్లను అడ్డుపెట్టాడు. దీంతో గ్రామస్థులు వచ్చి అభ్యంతరం తెలుపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 

విషయం తెలుసుకున్న ఎస్సై ఇమ్రాన్ సిబ్బందితో కలిసి వెళ్లి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మోహన్ పోలీసులపైనే ఎదురుతిరిగి, బండరాయితో కొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.