calender_icon.png 21 December, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజ్జనార్ టీం యాక్షన్!

21-12-2025 01:01:54 AM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం

ఎవరి ఆదేశాలతో ట్యాప్ చేశారు?

హార్డ్‌డిస్కులేమయ్యాయి?

ప్రభాకర్‌రావుపై ప్రశ్నలవర్షం!

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ఫోన్ ట్యా పింగ్ కేసులో 21 నెలల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం నుంచి తమ పని మొదలుపెట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిష నర్ సజ్జనార్ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ తొమ్మిది మంది సభ్యుల బృం దం.. కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును విచారించేందుకు రంగంలోకి దిగింది.

సుప్రీంకోర్టు  కస్టడీ గడువును ఈ నెల 26 వరకు పొడిగించడంతో, ఈలోపే కీలక సమాచారం రాబట్టాలని సిట్ నిర్ణయించింది. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొత్త సిట్ సభ్యులతో సీపీ సజ్జనార్ కీలక సమావేశం నిర్వహించారు. విచారణను ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏయే అంశాలపై ప్రధానంగా ప్రశ్నించాలి? అనే దానిపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సిట్ సభ్యుల్లో ఒకరైన ప్రస్తుత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పాత్ర ఈ కేసులో కీలకంగా మారింది.

ఆయన హయాంలోనే ఈ కేసు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, ఆయనకు కేసు పూర్వాపరాలపై పూర్తి పట్టు ఉండటంతో.. ఆయన సూచనలను బృందం పరిగణనలోకి తీసుకుంటోంది. సమావేశం అనంత రం మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి తరలించా రు. అక్కడ కొంతసేపు ఉంచిన తర్వాత తిరిగి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకువచ్చారు. 

అక్కడే ఓ ప్రత్యేక గదిలో ప్రభాకర్‌రావును సుదీర్ఘంగా విచారించారు. గత సిట్ బృందానికి సహకరించని ప్రభాకర్‌రావు నుంచి నిజాలు రాబట్టేందుకు సజ్జనార్ టీమ్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ఎందుకు ట్యాప్ చేశారు? దీనికి ఎవరి ఆదేశాలు  ఉన్నాయి? టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు? అనే కోణంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం.

కేసు బయటపడగానే ఎస్‌ఐబీ కార్యాలయంలోని హార్డ్‌డి స్కులు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ఐక్లౌడ్ పాస్‌వర్డులు ఎవరి దగ్గర ఉన్నాయి? ధ్వంసమైన డేటాను రికవరీ చేయడానికి పాస్‌వర్డులు ఇవ్వాలని సిట్ అధికారులు ప్రభాకర్‌రావుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇలావుండగా, శనివా రం మధురానగర్‌లో జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ అవగాహన సదస్సులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసు గురిం చి ప్రస్తావించారు. కొత్త సిట్ ఆధ్వర్యంలో విచారణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సిట్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.