26-01-2026 03:08:47 AM
మానకొండూరు, జనవరి 25 (విజయక్రాంతి):కరీంనగర్ పురపాలక సంస్థ పరిధి లోని 8వ డివిజన్ (అల్గునూర్)లో బీఆర్‌ఎస్ పార్టీ కోలుకోలేని దక్కా తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ చల్లా ర వీందర్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఆ లయ కమిటీ చైర్మన్ కంది అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిందం కిష్టయ్యతోపాటు పలువురు గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పు చ్చుకున్నారు.
ఆదివారం అల్గునూర్ చౌరస్తాలో 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు త మ్మనవేణి రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానకొండూర్ ఎమ్మె ల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కాంగ్రెస్ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అల్గునూర్ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కా రం కోసం తెగించి కొట్లాడగలిగే సత్తాగల కాంగ్రెస్ పార్టీ డివిజన్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి గెలుపు కోసం బేషరతుగా మద్దతించేందుకే బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ పా ర్టీలో చేరినట్టు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు తనను గుండెలో పెట్టుకొని గెలిపించిన అల్గునూర్ ప్రజలు గోపు మల్లారెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించాలని కో రారు. తన మాదిరిగానే రాజకీయాల్లో వె న్నంటి ఉంటున్న గోపు మల్లారెడ్డిని కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీని గౌరవించాలన్నా రు. అల్గునూరు గ్రామంపైన, ప్రజలపైన తన కు ఎనలేని ప్రేమ ఉందని,
ప్రజల కష్టసుఖా ల్లో పాలుపంచుకుంటానని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం క ల్పిం చే విషయంలో ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మినారాయణ రెడ్డి, పార్టీ నాయకులు సుదగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, తుమ్మనపల్లి శ్రీనివాస రా వు, శ్రీగిరి రంగారావు, గువ్వ రాజేందర్ రెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి,గంకిడి లక్ష్మారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.