calender_icon.png 19 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ ఏది?

19-09-2025 12:00:00 AM

  1. అభ్యాస్ స్కూల్ భవనం నుండి దూకిన విద్యార్థి
  2. విద్యార్థికి రెండు కాళ్లు విరిగిన వైనం ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  3. ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు 
  4. జిల్లా ప్రజా ప్రతినిధి జోక్యంతో విద్యార్థి ఇంటికి వెళ్ళిన పాఠశాల యజమాన్యం

మిర్యాలగూడ, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు రక్షణ లేదని తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ప్రైవేటు పాఠశాలల హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నప్పటికీ ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ కనీస విద్యార్థుల పట్ల రక్షణ లేకుండా కరువైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ పట్టణంలో ‘ అభ్యాస్ ‘ స్కూలు బడా స్కూలు ప్రైమరీ హై స్కూల్ రెండు బ్రాంచ్లుగా నిర్వహిస్తున్న ఆ స్కూలు లో వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఆ స్కూల్లో హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నాడు. ఆ విద్యార్థి  పై టీచరు చేయి చేసుకోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి హాస్టల్ భవనం  మొదటి అంతస్తు నుండి కిందకు దూకి రెండు కాళ్లు విరగ్గొట్టుకున్నాడు ఆ విద్యార్థి ప్రాణాపాయానికి ఎటువంటి అపాయం లేకపోవడంతోతల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

అభ్యాస్ పాఠశాలలో విద్యార్థి పై టీచర్ చేయి చేసుకోవడంతో తాపానికి గురైన విద్యార్థి భవనంపై దూకి కాళ్లు విరగొట్టుకున్నాడు. విద్యార్థి భవనంపై నుండి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి దీంతో విద్యార్థి నేలపై పాక్కుంటూ  తన స్నేహితుల వద్దకు చేరుకున్నాడు గమనించిన స్నేహితులు శెట్టిపాలెం ఆటో స్టాండ్ వద్దకు తమ తమ సైకిల్ పై తీసుకువచ్చి వదిలేశారు. దీంతో ఆ విద్యార్థి ఆటోని ఆశ్రయించి తమ స్వగ్రామమైన శెట్టిపాలెం గ్రామానికి చేరుకున్నాడు.

విద్యార్థి హాస్టల్లో లేకపోయినా గుర్తించని యాజమాన్యం

విద్యార్థి గత రెండు మూడు రోజులుగా హాస్టల్లో లేకపోయినా యాజమాన్యం గుర్తించకపోవడంతో తల్లిదండ్రులు జిల్లా ప్రతినిధి అయిన ఓ నేతను కలిసి వారి గోడును విన్నవించుకున్నారు. దీంతో ఆ ప్రజా ప్రతినిధి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి నా తర్వాత యాజమాన్యం మూడు రోజులకు ఆ విద్యార్థి దగ్గరికి చేరుకున్నారు.

ప్రైవేట్ స్కూళ్లలో రక్షణ ఇంత కరువైతుందా అని ఆ విద్యార్థి తల్లిదండ్రులుఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఫీజులు వసూలు చేసే శ్రద్ధ విద్యార్థుల చదువు, రక్షణ పై పెట్టకపోవడం చాలా బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 

ఫీజులు  వసూలు చేసే శ్రద్ధ విద్యార్థుల పట్ల ఎందుకు ఉండదు

ప్రైవేటు స్కూల్లో యజమాన్యం ఫీజులు వసూలు చేసే శ్రద్ధ విద్యార్థుల రక్షణ పట్ల ఎందుకు ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయగలరని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు