calender_icon.png 9 July, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి

09-07-2025 12:24:03 AM

ఎల్లారెడ్డిపేట,జులై8(విజయక్రాంతి); దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జ యంతి వేడుకలను మండల కేంద్రంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ.

ప్రజల కోసం వైయస్ తెచ్చిన సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు వాటిని కొన సాగించడం జరుగుతుందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్,ఇందిరమ్మ ఇండ్లు,  పెన్షన్లు,108 అంబులెన్స్ సౌకర్యం వాటిని కొనసాగించక తప్పనిసరి పరిస్థితి ఏ ర్పడిందన్నారు.మన ప్రాంతంలో మిడ్ మా నేరు ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఆయన సేవలు మరవలేని అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి,జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్,గిరిధర్ రెడ్డి,నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్,వంగ మల్లారెడ్డి,గంట బుచ్చగౌడ్,నంది కిషన్,బండారి బాల్ రెడ్డి,రోడ్డ రామచంద్రం, పొన్నాల మల్లారెడ్డి తదితరులుపాల్గొన్నారు.