01-09-2025 01:48:49 AM
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): దామాషా ప్రకారం బీసీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు తమ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లులపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. బీసీలు అంచెలంచెలుగా ఎదగాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలుతోనే సామాజిక న్యాయం బీసీలకు దక్కుతుందని ఆయన తెలిపారు. బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు మద్దతు తెలపాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు.