calender_icon.png 22 November, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగ కొడుకు నాకొద్దు

17-08-2024 02:54:17 AM

  1. అతడిని వదిలేసి ఇంటికి రా! 
  2. భార్యకు తేల్చిచెప్పిన భర్త 
  3. ఇంటి ఎదుట భార్య ఆందోళన 

రాజేంద్రనగర్, ఆగస్టు 16: కొడుకు దివ్యాంగుడని.. అతడిని వదిలేసి వస్తేనే ఇంట్లోకి రావాలని భర్త చెప్పడంతో ఆ మహిళ తన భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకా రం.. హైదర్‌గూడకు చెందిన బీట్కూరి ఉద య్ భాస్కర్ 2014లో నగరంలోని ఫతేనగర్‌కు చెందిన అలేఖ్యను వివాహం చేసుకు న్నాడు. వీరికి కొడుకు(సాయికౌషల్) పుట్టాడు. ప్రస్తుతం అతడికి 8 ఏళ్ల వయస్సు.

బాబు దివ్యాంగుడు. అవిటివాడైన కొడుకు తనకు వద్దని, అతడిని వదిలేసి ఇంటి కి రావాలని ఉదయ్‌భాస్కర్ భార్య అలేఖ్య కు తేల్చిచెప్పాడు. దీనికి అలేఖ్య మనసు నిరాకరించింది. కొడుకును తీసుకొని ఇంటికి వస్తానని భర్తకు చెప్పినా అతడు నిరాకరించాడు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం నుంచి భర్త ఇంటి ఎదుట కుటుంబీకులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది.