17-08-2024 02:52:23 AM
సిద్దిపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, మిట్టపల్లిలోని సురభి వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు తరగతులను బహిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు.
జనగామ: జనగామ జిల్లా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ సేవలు నిలిపివేసి వైద్యులు ఆందోళనకు దిగారు.