calender_icon.png 22 November, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాల జిల్లాలో ఒకరికి రిమాండ్

17-08-2024 10:39:19 AM

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన కొండ నరేష్ ను శుక్రవారం రిమాండ్ చేసినట్లు దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... నరేష్ పై గతంలో పలు కేసులు నమోదు కావడంతో పాటు, 2021లో రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశారు. అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటం, ఇటీవల నెల్కి వెంకటాపూర్ లో జరిగిన భూమి వివాదంలో తల దూర్చడంతో నరేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ... దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరి మీద ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే, కచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని, శాంతి భద్రలకు విఘాతం కల్గిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. అవసరం అయితే పీడీ ఆక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.