calender_icon.png 10 August, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీలు.. నా ఆత్మ బంధువులు..

09-08-2025 05:18:48 PM

పద్మశాలీలకు నాకు విడదీయరాని బంధం ఉంది..

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): పద్మశాలి కులస్తులు నాకు ఎప్పటికీ ఆత్మబంధువులేనని పద్మశాలిలకు నాకు విడదీయరాని బంధం ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. శనివారం రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితి ప్రకారం జంజి ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కండేయ ఆలయంలో ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నాకు వెన్నంటే ఉండి ప్రతి ఎన్నికల్లో పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసికట్టుగా నాకు మద్దతు తెలుపుతూ నా గెలుపుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పద్మశాలీలకు నాకున్న బంధం విడదీయరానిదని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి తో పాటు రాఖీ పండుగ సందర్భంగా ఇతరత్రా ఎలాంటి కార్యక్రమాలైనా పాల్గొనడం జరుగుతుందన్నారు అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు పవిత్ర బంధం రాఖీ బంధన్ అలాంటి బంధాన్ని ఎప్పటికీ నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష అంటూ రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకోవడం భారతదేశ గొప్ప సంస్కృతి,సాంప్రదాయమని ఆయన తెలిపారు. పద్మశాలి సంఘంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కుల సంఘం పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఆలయ అధ్యక్షులు జిల్లా కాశీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు గూడ శ్రీనివాస్ సంఘ సభ్యులు రామచందర్ నరహరి బాల కృష్ణ బాలరాజ్ సాయిలు పండరి యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.