calender_icon.png 10 August, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి: ఎమ్మెల్యే

09-08-2025 05:15:35 PM

టేకులపల్లి (విజయక్రాంతి): అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య(MLA koram Kanakaiah) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కా, తమ్ముళ్ల, అన్నా, చెల్లెళ్ల వెలకట్టలేని ఆప్యాయతలు, అనురాగాలకు ఈ పండుగ నిలువెత్తు నిదర్శమన్నారు. రక్షా బంధన్‌ కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే ఇంట్లో పలువురు మహిళలు, బంధువులు, చిన్నారులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు రాఖీలు కట్టారు.