calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను

24-09-2025 01:19:29 AM

-యుద్ధాలు ఆపడంలో ఐరాస విఫలం

-అసాధ్యం అనుకున్నది నేను సుసాధ్యం చేశాను

-నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి

-ఐరాస జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

న్యూయార్క్, సెప్టెంబర్ 23: కేవలం ఏడు నెలల్లో తాను ఏడు యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉద్ఘాటించారు. ఐక్య రాజ్య సమితి (ఐరాస) 80వ జనరల్ అసెంబ్లీలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాంబోడియా థా య్‌ల్యాండ్, ది కాంగో  రువాండా, పాకిస్థాన్  భారత్, ఇజ్రాయెల్   ఇరాన్, ఈజి ప్ట్  ఇథియోపియా, అర్మెనియా అజర్‌బైజన్, సెర్బియా అంతర్యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు.

ఇతరులు అసాధ్యమని భా వించిన దానిని తాను సుసాధ్యం చేసి చూ పించానని పేర్కొన్నారు. కొన్ని దేశాల మధ్య మూడు దశాబ్దాలుగా యుద్ధాలు జరుగుతున్నాయని, యుద్ధాల్లో లక్షలాది మంది ప్రజ లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అ మెరికా ఏడాది క్రితం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని, తన అధికార పగ్గాలు చేపట్టాక పాలనలో మార్పులు వచ్చాయన్నారు. తమ దేశా నికిది స్వర్ణయుగమని అభివర్ణించారు. 

ఐరాస విఫలం..

తాను ఏడు యుద్ధాలు ఆపానని, అయినప్పటికీ తనకు ఐరాస ఏమాత్రం సాయ పడలేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశా రు. సాధారణంగా యుద్ధం ఆపే పనులు ఐరాస ఆపుతుందని, కానీ.. ఐరాస ఆ పనికి పూనుకోలేదని, ఆయా దేశాల్లో యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు తాను అన్ని దేశాధినేతలతో మం తనాలు సాగించానని, కానీ, ఐరాస మాత్రం కనీసం తనకు కాల్ అయినా చేయలేదని మండిపడ్డారు. ఏడు యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ బహుమతి రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అలాగే ఐరాసలో తనకు ఎదురైన అనుభవాన్ని సైతం వేదికపై మాట్లాడారు. తాను  సభకు వస్తుండగా ఎస్కలేటర్ ఉన్నట్టుండి మధ్యలో ఆగిపోయిందని, తన భార్య మెలానియా మంచి ఫిట్‌నెస్‌లో ఉన్నందువల్ల తనను కాపాడగలిగిందన్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపునకు భారత్, చైనా కారణమని ఆరోపించారు. ఆ రెండు దేశాలు చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ రష్యాకు సాయం చేస్తున్నాయని విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో ఐరోపా, నాటో దేశాలు విఫలమయ్యాయని ట్రంప్ మండిపడ్డారు.