24-09-2025 01:20:50 AM
-దేశంలో 45 ఏళ్ల గరిష్ఠస్థాయికి నిరుద్యోగం
-ఉపాధి, ఉపాధి అవకాశాల కోసం యువత పాట్లు
-ప్రధాని మోదీ మాత్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం
-ఓట్‌చోరీని ఇకపై యువత సహించదు
-‘ఎక్స్’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో ‘ఓట్‌చోరీ’ జరిగినంత కాలం నిరుద్యోగం, అవి నీతి పెరుగుతూనే ఉంటుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు. దేశంలో యువత ఇ ప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాసుకొచ్చారు. కొలువులు కావాలని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియోతోపాటు పాటు ప్రధాని మోదీ యోగా చేస్తున్న వీడియో, నెమళ్లకు ఆహారం అందిస్తున్న వీడియోను షేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వానికి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ఓట్‌చోరీ చేసి, రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తూ అధికారంలో కొనసాగుతున్నదని ఆరోపించారు. అలాం టి చర్యలను దేశ యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేశంలో నిరుద్యోగం గరిష్ఠ స్థాయి వ యసు 45 ఏళ్లకు చేరుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా వెలుగు చూ సిన ప్రతి ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక అవినీతి కథనాలు ఉంటున్నాయని, యువత తమ భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే ప్రధాని మోదీ మాత్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసి పనిలో, సెలబ్రెటీలతో ఫొటోలు దిగే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు తగ్గడానికి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కుప్పకూలడానికి, యువత భ విష్యత్తు అంధకారంలో పడిపోవడానికి ‘ఓట్‌చోరీ’ కారణమని దుయ్య బట్టారు. బీజేపీ ప్రభుత్వం యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నదని, నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. నిరుద్యోగం, ఓట్‌చోరీ సమస్యల నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన అ వసరం ఉందని, అది సాకారం చేయడాన్నే యువత దేశభక్తిగా భావించాలని పిలుపునిచ్చారు.