25-07-2025 01:48:36 AM
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మృణాళ్ ఠాకూర్. ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ హీరో అడివిశేష్‌తో ‘డెకాయిట్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. షనీల్ డియో కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. మరోవైపు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ నటిస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్2’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
మరో నాలుగు సినిమాలనూ లైన్‌లో పెట్టిందీ చిన్నది. ఇలా ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ సుందరి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృణాళ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చిట్‌చాట్ చేస్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. “పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది.
తల్లి కావడమనేది నాకు ఎంతో కాలంగా ఉన్న కల. అయితే నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉంది” అని చెప్పింది. ఇలా నిజాయితీగా తన మనసులో మాట బయటపెట్టిన మృణాళ్ ఠాకూర్.. నెటిజన్లు కురిపిస్తున్న ప్రశంసల జల్లు తడిసి ముద్దయిపోతోంది.