calender_icon.png 11 January, 2026 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను రద్దు చేస్తే ఊరుకోను

10-01-2026 01:30:39 AM

  1. సిద్దిపేట అంటే నా కుటుంబం 

మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, జనవరి 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డికి నాపై కోపం ఉంటే సిద్దిపేట జిల్లాని రద్దు చేయొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉన్న నాయకులు వాస్తవం తెలుసుకొని బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.

ఒకప్పుడు సిద్దిపేటలో పందులు, మురికి కాల్వలు అధికంగా ఉండేవని, ఇప్పుడు అవి ఏవి కనిపించడం లేదని చెప్పారు.సైకిల్ మీద నీళ్లు మోసిన బాధలు పోయి ప్రతి ఇంటికి నల్లాని ఏర్పాటు చేసి తన శక్తి మేరకు సిద్దిపేటను అభివృద్ధి చేశానని చెప్పారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 40ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్ జిల్లాగా మార్చి నిజం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాను రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.