05-12-2025 12:00:00 AM
గజ్యనాయక్ తండా అభ్యర్థిని గోనే శివాని
తండావాసులకు బాండ్ పేపర్‌పై హామీపత్రం అందజేత
కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గజ్యా నాయక్ తండాలోని ప్రధాన సమస్యలు పరిష్కరిస్తానని సర్పంచ్ అభ్యర్థిని గోనే శివాని 100 రూపాయల బాండ్ పేపర్‌పై తండా ప్రజలకు గురువారం హామీ పత్రాన్ని రాసి ఇవ్వడం జిల్లాలో కలకలం రేపింది.
సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే గెలిచిన ఆరు నెలల నుంచి ఏడాది లోపు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపడతానని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ లో తండా ప్రజలకు రాసి ఇచ్చారు. లేనిపక్షంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తానని శివాని పేర్కొన్నారు.ఆమె బాండ్ పేపర్ లో హామీలు నెరవేస్తానని రాసి ఇవ్వడం చూసి మరికొందరు ఇదే బాటను ఎంచుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.