calender_icon.png 10 October, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సైన్స్ డ్రామా పోటీలు

09-10-2025 07:37:20 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా సైన్స్ కేంద్రంలో గురువారం దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొనడానికి ఆరు పాఠశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారు. హైజిన్ ఫర్ ఆల్(అందరి కోసం పరిశుభ్రత) అనే అంశంపై తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల శాయంపేట విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికయింది. జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రామా పోటీ సందర్భంగా విద్యార్థుల సామాజిక సమస్యలను విజ్ఞాన శాస్త్ర దృక్కోణంలో అవగాహన కల్పించడానికి, పరిష్కారాలను ప్రచారం చేయడానికి సైన్స్ డ్రామాలు ఎంతగానో దుహదం చేస్తాయని అన్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గుణాత్మక విద్య సమన్వయకులు డా. బండారు మన్మోహన్ విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని వారిలోని అంతర్గత శక్తులకు పదును పెట్టాలని సూచించారు. ఈ పోటీలకు బహుమతులను అందించిన లైన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షులు టి.రమేష్ బాబు, సభ్యులు ప్రభాకర్ పాల్గొనగా న్యాయ నిర్ణయితలుగా ప్రముఖ రంగస్థలం మరియు సినీ నటుడు బిటవరం శ్రీధర స్వామి, చెడుపాక రాములు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.