calender_icon.png 2 January, 2026 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు అండగా ఉంటా..

02-01-2026 12:00:00 AM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేట క్రైం, జనవరి 1 : బీఆర్‌ఎస్ పార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని దుబ్బాక ఎ మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. 252 జీవో ను నిరసిస్తూ తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులను 13వేలకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. జర్నలిస్టులకు మద్దతుగా ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. కార్యక్రమంలో టీ యూ డబ్ల్యూజే జిల్లా బాధ్యులు గందె నాగరాజు జిల్లా నాయకులు నిమ్మ అశోక్, కట్ట నవీన్ , ప్రసాద్ ప్రభాకర్ సుదర్శన్ పాల్గొన్నారు.