calender_icon.png 6 August, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా

06-08-2025 12:01:04 AM

అలంపూర్, ఆగస్టు 05:ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.మంగళవా రం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో పలువురి లబ్ధి దారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం సహాయనిధి చె క్కులను పంపిణీ చేశారు.

అయిజకు చెంది న మమతకు రూ. 5,00,000,పర్దిపురం గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు రూ,36,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదా రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులుపాల్గొన్నారు.