27-10-2025 12:54:04 AM
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలు చేస్తు న్నారు. తన తర్వాత ప్రాజెక్టు డైరెక్టర్ బాబీ కొల్లితో చేయబోతున్నట్టు ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకం పై రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతానికి ‘మెగా158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది.
2027 సంక్రాంతి విడుదల చేసేలా ప్రణాళితో ముందుకు వెళ్తున్నా రట మేకర్స్. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని డీవోపీగా పనిచేస్తున్నారు. గతంలో చిరు కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని నమోదు చేయటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీకి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్‌ను ఇదివరకే విడుదల చేశారు. రక్తంతో తడిసిన గొడ్డలిని చూస్తుంటే.. ఇది పక్కా యాక్షన్ చిత్రమని తెలుస్తోంది. ఇందులో అనుష్క శెట్టితోపాటు మాళవిక మోహనన్‌ను కూడా హీరోయిన్‌గా తీసుకుంటారని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు కార్తీ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో కార్తీ ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించనున్నారట. అయితే, చిరు ఇటీవలి సినిమాలను గమనిస్తే.. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ ముఖ్యపాత్ర పోషించారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు బాబీ రూపొందించే సినిమాలో కార్తీ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా మెగాస్టార్ చిత్రాల్లో స్టార్ హీరోలు భాగమవుతుం డటం పట్ల ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.