24-12-2025 12:34:14 AM
పంచాయతీ ఎన్నికల వ్యయ వివరాలపై ఈసీ ఆదేశం
నిర్లక్ష్యం వహిస్తే వేటు పడే ప్రమాదం
సంగారెడ్డి, డిసెంబర్ 23(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అయితే పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తాను చేసిన ఖర్చుల వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గడువులోపు సమర్పించకుంటే పదవీ కోల్పోయే అవకాశముందని స్పష్టం చేసింది. వివరాల సమర్పణకు తొలిసారిగా ఆన్లైన్ వి ధానం అందుబాటులోకి తెచ్చింది. టీఈ-ఫో ల్ వెబ్ పోర్టల్లో పొందుపర్చాలని సూచించింది. సకాలంలో సమర్పించకుంటే ఎన్నిక ల్లో పోటీకి అనర్హులయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.
వ్యయ వివరాల సమర్పణ ఇలా..
ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు చేయాల్సిన ఖర్చులను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈసీ నిబంధనల ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు రూ.30 వేలు వరకు ఖర్చు చే యాల్సి ఉంటుంది. ఐదు వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ పదవీకి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుల పదవికి రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చని ఈసీ నిర్ణ యించింది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వ రకు ఈ ఖర్చులను వెల్లడించాల్సి ఉంటుంది.
ఫారం-1లో అభ్యర్థులు చేసిన మొత్తం వ్య యం, ఫారం-2లో రోజు వారీగా చేసిన ఖర్చు ల వివరాలు, ఫారం -3లో దేని కోసం ఎంత ఖర్చు చేశారు వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను సమర్పించినట్లుగా ఫారం-4 అందజేసి రశీదు పొందాలి. ఈమేరకు ఈసీ స్పష్టమైన గడువు కూడా ని ర్దేశించింది. తొలి విడతలో పోటీ చేసిన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 21, రెండో విడత వారు జనవరి 27, మూడో విడత వారు జనవరి 30వ తేదీ వరకు వివరాలను సంబం ధిత ఎంపీడీవోలకు రాతపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది.
గడువులోపు ఇవ్వకుంటే వేటు..
పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్- 23 ప్రకారం గడువులోపు ఈ వివరాలను సమర్పించకుంటే గెలిచిన అభ్యర్థులు పదవీ కో ల్పోవడంతో పాటు మూడేళ్ల పాటు ఎన్నిక ల్లో పోటీకి అనర్హులవుతారు.
ఓడిన అభ్యర్ధు లు మూడేళ్ల వరకు ఇతర ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఎంపీడీవోలకు అందిన ఈ వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లా కమిటీ పరిశీలించి టీఈ- ఫోల్ వ్బుసైట్లో అప్లోడ్ చేయనున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.