24-12-2025 12:35:31 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్ 23(విజయ క్రాంతి): కెరమెరి మండలంలో జనవరి 17, 2026 వరకు జరుగనున్న జంగుబాయి ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కెరమెరి మండలం హట్టి గిరిజ న ఆశ్రమ పాఠశాలలో ఉట్నూర్ సమగ్ర గిరిజ న అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఎఎస్పి. చిత్తరంజన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జంగుబాయి దేవస్థానం కమిటీ సభ్యులు సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్ లతో కలిసి అధికారుల తో ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ ఉత్సవాలలో భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవం సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని, ఈ నెల డిసెం బర్ నెల 22 నుండి జనవరి 17, 2026 వరకు జరగనున్న ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశు ధ్యం, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయ డం నిరంతరం జరగాలని, 24 గంటలు వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచి నిరంతర వైద్య సేవలు అందించాలని తెలిపారు.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ మాట్లాడుతూ నీటి సరఫరా, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాటు చేయా లని, వాహనాల పార్కింగ్, రోడ్లకు ఇరువైపుల మొక్కలను తొలగించే విదంగా చూడాలని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా, అవసరమైన పూజ సామాగ్రి, విద్యుద్దీకరణ వంటి పనులను అధికారులు సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు బస చేయడానికి 2 షెడ్లు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగా త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు.
అనంతరం ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ కోటపరందోలిలో ఉన్న జంగుబాయి దేవస్థానం సందర్శించి అక్కడి ఏర్పాట్లను సందర్శించి, భక్తులను, కమిటీ సభ్యులను, నాయకులను ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకొని ఎవరికి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.