calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్ ఆడుకుంటే..

26-09-2025 12:21:52 AM

శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్, ప్రతాప్ ముఖ్యపాత్రల్లో వస్తున్న తమిళ థ్రిల్లర్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’. రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ను దీప్తి గోవిందరాజన్ రచన చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ ఓటీటీలోకి అడుగుపెడుతున్న సిరీస్ కావటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

నెట్‌ఫ్లిక్ వేదికగా అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ గురువారం విడుదలైంది.  ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. “స్వతంత్ర మహిళగా, అదే సమయంలో గేమింగ్ డెవ లపర్‌గా ఉన్న పాత్రలోకి అడుగుపెట్టడం థ్రిల్లింగ్‌గా, సవాలుగా అనిపించింది. ఆమె సృష్టించిన ప్రపంచమే తనకు వ్యతిరేకంగా మారి, భయంకర వాస్తవంగా మారే అంశాలు థ్రిల్లర్‌గా అనిపిస్తాయి” అని తెలిపింది.