calender_icon.png 27 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరైనా లొంగిపోవాల్సిందే!

26-09-2025 12:23:06 AM

రుక్మిణీ వసంత్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.  ఇటీవల ‘మదరాసీ’లో శివకార్తికేయన్‌తో  ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’తో రానుంది. ఇటీవలే ట్రైలర్‌తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ట్రైలర్‌లో యువరాణి కనకావతి పాత్రలో రుక్మిణీ ఆహార్యం ఆకర్షిస్తోంది.

రిషబ్‌శెట్టి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో కలిసి వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది రుక్మిణీ వసంత్. ‘కనకా వతి’ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు మరికొన్ని వివరాలను రివీల్ చేసింది. కనకావతి తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలస్తుందని ధీమా వ్యక్తం చేసింది. “మన జానపద కళలను ముందుకు తీసుకెళ్లే అద్భత చిత్రం ఇది.

కనకావతి రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆమెలో గర్వం ఇసుమంతైనా కనిపించదు. ఎంతో సున్నితమైన పాత్ర. కనకావతి చూపించే దయ, ఆమె ధైర్యానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే. యువరాణి పాత్రలో కాస్తయినా పొగరుతనం కనిపిస్తుంది. కానీ, ఈ యువరాణి అందుకు భిన్నంగా తెరపై కనిపిస్తుంది.

యువరాణులు ఇలా కూడా ఉంటారా..? అనేంత కొత్తగా మలిచారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు ఓ కొత్త అనుభూతికి లోనవుతారు” అని వివరించింది. ఇక రుక్మిణీ వసంత్ నుంచి రాబోయే సినిమాల విషయాకొస్తే.. ఆమె ప్రస్తుతం యష్‌తో కలిసి ‘టాక్సీక్’లో జతకడుతోంది. తెలుగులో ఎన్టీఆర్ కథా నాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’లో నటిస్తోంది.