26-09-2025 12:20:49 AM
పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెం ట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది. దీంతో చిత్రబృందం గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. కథానాయిక ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. “ఓజీ’ కోసం అం దరూ ఎంతగానో ఎదురుచూశారు.
ఇప్పుడు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇంతకు మించి ప్రేక్షకుల నుంచి మేము ఏం కోరుకుం టాం. డీవీవీ బ్యానర్‌లో నాకిది రెండో సిని మా. వరుసగా రెండో విజయం దక్కడం సంతోషంగా ఉంది” అన్నారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “దాదాపు మూడేళ్ల ప్రయాణం. ఓజీ కథకు ఇంతటి భారీతనం రావడానికి కారణం పవన్ కళ్యాణ్. నేను ఆయనకు వీరాభిమాని ని. జానీ సినిమా సమయం నుంచి పవన్‌ను కలిస్తే చాలు అనుకునేది.
అలాంటిదిప్పుడు ఆయనతో సినిమా చేయడం, దానికి బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు. నిర్మాత దానయ్య మాట్లాడు తూ.. “పవన్‌కళ్యాణ్‌తో సినిమా అనుకున్నప్పుడు సుజీత్ పేరు త్రివిక్రమ్ సూచించారు. పవన్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశం తో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీ త్, తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ పగలు, రాత్రి అనే తేడా లేకుండా సినిమా కోసం కష్టపడ్డారు.
నిజానికి ఈ టైటిల్‌ను నాగవంశీ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, మా కోసం ఇచ్చేశారు. అభిమానుల స్పందన చూస్తుంటే సం తోషంగా ఉంది” అని తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం.
మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పనిచేస్తాం” అన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ, చిత్ర నిర్మాత కళ్యాణ్ దాసరి, ఎడిటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఓజీ’ టీమ్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట
టికెట్ ధరల పెంపు విషయంలో ‘ఓజీ’ చిత్రబృందానికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ సినిమా టికెట్ ధరలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకు స్టే విధించింది. ఈ సినిమా ప్రదర్శనతోపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ తెంలగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అభ్యర్థనను అంగీకరిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అయితే, ఈ మెమోను మహేశ్‌యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. టికెట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చే అధికారి హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌కే ఆ ఉత్తర్వులు జారీచేసే అధికారం ఉందని చెప్పారు. దీంతో న్యాయస్థానం టికెట్ ధరలు పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.