26-01-2026 01:48:57 AM
సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సారలమ్మ చేరే రోజు కన్నేపల్లి లోని సారల మ్మ గుడి వద్ద తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు నేలపై పడుకుని వరం పడతారు. సారలమ్మ తల్లిని గద్దెకు తోడుకొని వెళ్లే పూజారులు వరం పట్టిన వారి పైనుండే నడుచుకుంటూ వెళతారు. వరం పట్టిన వారి కి ఎలాంటి ఆపద కలగకపోగా, వారు తల్లిని కోరిన కోర్కె తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం కలిగి ఉంటారు.
అంతా అమ్మ దయ.. మా మంచి చెడు అంతా తల్లి చూసు కుంటుందని భావిస్తారు. దీనితో ప్రతి జాతర సందర్భంగా చాలామంది భక్తులు కన్నెపల్లి సారలమ్మ గుడి వద్దకు చేరుకొని నేలపై పడుకుని గంటలపాటు తల్లి రాక కోసం నిరీక్షిస్తారు. కోరిన కోర్కె నెరవేర డంతో మళ్లీ వచ్చే జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుం టారు. ఇది అనాదిగా కొనసాగుతోంది.