calender_icon.png 24 August, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్‌లో పొంగి ప్రవహిస్తున్న వాగులు

19-08-2025 01:44:42 AM

కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు 

మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నా యి. కొన్నిచోట్ల వంతెనల మీదుగా నీరు ప్ర వహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. మూడుచింతలపల్లి, ఉద్యమరి మధ్య వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడ్చల్ మండలం లోని మేడ్చల్, గౌడవెల్లి మధ్య, డబ్బులుపూర్‌ొోలింగాపూర్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. పంట పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది.