09-08-2025 05:04:46 PM
కమిషనర్ బి. అనురాధ..
సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ బి. అనురాధ(Commissioner B. Anuradha) తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల నిర్వహణకు, అదేవిధంగా డీజే సౌండ్ వినియోగంపై ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్ ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.