09-08-2025 05:07:54 PM
ప్రేమ, నమ్మకం, రక్షణ అనే విలువలను గుర్తుచేసే పవిత్రమైన ఆచారం రాఖి పూర్ణమి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగకు విశిష్టమైన స్థానం ఉందని, అనుబందాల పండుగగా రాఖీ పండుగను జరుపుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. బ్రహ్మ కుమారి మటం, భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే నివాసం, శేషగిరిభవన్లో శనివారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేనికి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాకు బ్రహ్మకుమారి మటం సభ్యులు, మహిళా సమాఖ్య కార్యకర్తలు రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ పంపిణి చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, శ్రావణ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ రాఖీ పండుగని అన్నారు.
ఈ పండుగకోసం తోబుట్టువులంతా ఏడాదంతా ఎదురు చూస్తుంటారని, విధి నిర్వహణలో ఎంత దూరం ఉన్నప్పటికి కుటుంబ సభ్యులందరిని ఒక్కటి చేసి కుటుంబ బాంద్యవ్యాంన్ని, బందుత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు. రాఖీ పండుగ మన సమాజంలో ప్రేమ, నమ్మకం, రక్షణ అనే విలువ లను గుర్తుచేసే పవిత్రమైన ఆచారమని, సోదర, సోదరీమణుల బంధాన్ని మాత్రమే కాకుండా పరస్పర గౌరవం, మానవతా భావన, సామాజిక ఐక్యతను బలపరుస్తుందన్నారు. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం, యువతకు అందించడం మనందరి బాధ్యత. సోదరులు సోదరీమణుల రక్షణకే కాక, సమాజం మొత్తానికి రక్షకులుగా నివాలన్నారు. తనకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి మటం సభ్యులకు, మహిళా సమాఖ్య నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.