calender_icon.png 14 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

14-12-2025 12:00:00 AM

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా

సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపో యింది. ౩ రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ ఇక్కడ అభిమానులకు మధు ర జ్ఞాపకాలను అందించాడు. ఫలక్ నుమా ప్యాలె స్‌లో మీట్ అండ్ గ్రీట్, ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మెస్సీని చూసి ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 

రాజకీయ దురంధరుడు శివరాజ్

వరుసగా ఏడు సార్లు ఒకే లోక్‌సభ నియోజకవర్గం (లాతూరు) నుంచి ఎంపీగా గెలిచిన రాజకీయ దురం ధరుడు శివరాజ్ పాటిల్. మహా రాష్ట్ర నుంచి ఎదిగి జాతీయ రాజకీ యాల్లో చక్రం తిప్పారు. 50 ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయా ల్లో లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖలు సమర్థంగా నిర్వర్తించారు. వృద్ధాప్య సమస్యల తో ఇటీవల కన్నుమూశారు.