calender_icon.png 21 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

21-12-2025 12:22:32 AM

పొలిటికల్ ‘నవీన’ నితిన్

అది 2006.. నితిన్ 26 ఏళ్ల ప్రాయం. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ. వరించిన విజయం. అది మొదలు వరుసగా బంకిపూర్ నియోజకవర్గం నుంచి ౪సార్లు ఎమ్మెల్యే గెలుపు. మంత్రిగా, బీజేపీలో కీలక నేతగా సేవలు. ఇంతలోనే అద్భుతమైన అవకాశం. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చాన్స్. ఇప్పుడతను బీజేపీలో ‘నవీన’ రాజకీయాలకు సారథ్యం వహించే నితిన్ !

‘శతాబ్ది శిల్పి’ రామ్ 

దేశం గర్వించదగిన శిల్పి రామ్ సుతారీ. మహారాష్ట్రకు చెందిన ఆయన గుజరాత్‌లోని 597 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, హైదరాబాద్‌లోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, కర్ణాటక విధాన సౌధ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహ రూపకర్త ఆయనే. ఆయన ఈనెల 18న వృద్ధాప్య సమస్యలతో మృతిచెందారు. నిండు నూరేళ్ల సంపూర్ణ జీవితం ఆయనది.