24-08-2025 01:11:07 AM
‘మణి’క.. నీకు తిరుగే లేదిక
రాజస్థాన్‌కు చెందిన మణిక
విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండి యా 2025 కిరీటం సొంతం చేసుకున్నారు. నవంబర్‌లో థాయ్‌లాండ్ వేదికగా జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
మూగబోయిన ప్రజల సుర‘వరం’
తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది. ఏండ్ల పాటు తెలంగాణ ప్రజల పక్షాన ఏండ్ల పాటు కొట్లాడిన సురవరం సుధాకర్ రెడ్డి (83) తుది శ్వాస విడిచా రు. ఉమ్మడి పాలమూరు జిల్లాల 1942లో పుట్టిన సురవరం ఏండ్ల పాటు పేద వర్గాల పక్షాన పోరాడిండు. 1960 నుంచే ఏఐఎస్ ఎఫ్‌లో, అనంతరం సీపీఐలో చేరి ప్రజల కోసం పోరాటం శేశిండు.