calender_icon.png 17 September, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభం

16-12-2024 12:00:00 AM

1951 డిసెంబరు 16: దేశంలో ఉన్న మూడు ప్రఖ్యాత జాతీయ మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. మూసీనది తీరంలో ఉన్న ఈ మ్యూజియంలో దాదాపు 48 వేల చారిత్రక వస్తువులను భద్రపరిచారు. ఈ మ్యూజియంలో మూడో సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సేకరించిన అరుదైన కళాఖండాలున్నాయి. అనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1951 డిసెంబరు 16న సాలార్జంగ్ కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు.

ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్

1971 డిసెంబర్ 16: 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో దేశం సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లో విక్టరీ డే జరుపుకుంటారు. పాకిస్తాన్ దళాలపై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 

విజయ్ దివస్ ఇండియా

1971  డిసెంబర్ 16: 1971 ఇండో- యుద్ధంలో భారత్  సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున భారత సాయుధ దళాలు నిర్ణయాత్మక విజయాన్ని సాధించాయి. ఫలితంగా పాకిస్తాన్ దళాలు లొంగిపోయి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత సైనిక సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగానికి స్ఫూర్తిగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం.