19-09-2025 12:00:00 AM
ప్రారంభించిన వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):మేడ్చల్ నియోజకవర్గం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ లో ఉన్న జ్యోతి నగర్ స్వాగత తోరణాన్ని మాజీ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్, ల తో కలిసి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్ ప్రారంభించారు. ఈ స్వాగత తోరణాన్ని మాజీ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ తన సొంత నిధులతో ఏర్పాటు చేయించడం జరిగింది.
గడిచిన మున్సిపల్ ఎన్నికల సమయంలో తనను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించిన జ్యోతి నగర్ కాలనీవాసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, వారి విన్నపం మేరకు కాలనీలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులను, మెరుగుపరిచానని ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్ అన్నారు. సొంత ఖర్చులతో స్వాగ త తోరణాన్ని ఏర్పాటు చేయించిన మాజీ కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీవాసులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఆర్టియే మెంబెర్ జైపాల్ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, సీసా వెంకటేష్ గౌడ్, బొమ్మకు కళ్యాణ్, కుంభం కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.