calender_icon.png 19 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలి

19-09-2025 12:00:00 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):  పెండింగ్ లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఆర్‌డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని  సందర్శించారు.సదరం క్యాంపు లను ఆసుపత్రిలోని పాత భవనంలో నిర్వహిస్తుండగా,  నూతన భవనంలోకి మార్చాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అయితే కొత్త భవనానికి సంబంధించిన పార్టీషన్ ,ఎలివేషన్ పనులవల్ల శిబిరం మార్పు సాధ్యమా కాలేదని డిఆర్ డి ఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  పాత భవనంలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త భవనంలో సదరం క్యాంపుల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్  ఆదేశించారు. అంతేకాక పెండింగ్ లో ఉన్న 2564 సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి క్యాంపుల నిర్వహన,పరిష్కారం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. జి జి హెచ్ డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ నగేష్ తదితరులు ఉన్నారు.