calender_icon.png 2 January, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 దేవాలయాలకు ‘ధూప దీప నైవేద్యం’

02-01-2026 01:11:55 AM

మంథని నియోజకవర్గ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, డిసెంబర్ 1(విజయక్రాంతి): మంథని నియోజక వర్గంలోని పెద్దపల్లి మరి యు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని పలు దేవాలయాలకు సంబంధించిన ధూప దీప నైవేద్యాలు పథకం మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కోరగా వెంటనే నియోజకవర్గంలోని 24 దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం మంజూరు చేశారు. మంజూరు చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

మంథని నియోజకవర్గంలో చాలా పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రా లుగా ఉన్న వాటిని అభివృద్ధి చేయాలని ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, మంథని నియోజకవర్గంలోని ఇంకను చాలా దే వాలయాలు ధూప దీప నైవేద్యం మంజూరు లేక ఉన్నాయని, వీటిని కూడా పరిశీలించి మంజూరు చేయాలని కోరుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గంలో మంజూరైన దేవాలయాలు 

*శ్రీ శివ వీర బ్రహ్మేంద్ర & శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయం, పన్నూర్ గ్రామం, రామగిరి మండలం,

*శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, మల్లారం గ్రామం, మంథని మండలం, 

*శ్రీ కోదండ రామాలయం, నాగారం గ్రామం మంథని మండలం,

*శ్రీ కోదండ రామాలయం, రత్నాపూర్ గ్రామం, రామగిరి మండలం, శ్రీ భక్త మల్లెపూల హనుమాన్ దేవాలయం - గంగాపురి, మంథని మున్సిపాలిటీలోనిశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, వెంకటాపూర్ గ్రామం, మంథని మండలం,

*శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, బెస్తపల్లి గ్రామం మంథని మండలం,

*శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఎక్లాస్ పూర్ గ్రామం మంథని మండలం,

*శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, గుండారం గ్రామం కమాన్ పూర్ మండలం,

*శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, సిరిపురం గ్రామం మంథని మండలం,

*శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రామ స్వామి గోపాల స్వామి దేవాలయం, గుంజపడుగు గ్రామం మంథని మండలం,

*శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, వకీల్ పల్లి, పన్నూర్ గ్రామం, రామగిరి మండలం,

*శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, మంథని గ్రామం, మండలం,

*శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, ముస్త్యాల గ్రామం, రామగిరి మండలం,

*మర్రిపాడు అభయాంజనేయ స్వామి దేవాలయం, చిన్నఓదెల గ్రామం మంథని మండలం,

*శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం, మంథని గ్రామం, మండలం,

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో మంజూరైన దేవాలయాలు

*శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, కొత్తపల్లి గ్రామం, కాటారం మండలం,

*శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, కుదురుపల్లి గ్రామం మహాదేవపూర్ మండలం,

*శ్రీ భూనీల సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఒడిపిలవంచ గ్రామం, కాటారం మండలం,

*శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, అంకుసాపూర్ గ్రామం, కాటారం మండలం,

*శ్రీ హనుమాన్ సహిత శివ పంచాయతన్ దేవాలయం, బొమ్మాపూర్, గ్రామం, మహాదేవ్ పూర్ మండలం,

*శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, జగ్గయ్యపల్లి, గ్రామం, కాటారం మండలం,

*శ్రీ అలకేశ్వర స్వామి దేవాలయం, ఎల్కేశ్వరం గ్రామం, మహదేవ్ పూర్, మండలం, శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, దామెరకుంట గ్రామం, కాటారం మండలం,

మంథని నియోజకవర్గంలో ధూప దీప నైవేద్యం పథకం కింద 24 దేవాలయాలకు మంజూరు కృషిచేసిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కు పెద్దపెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సంబంధించిన ధూప దీప నైవేద్య పథకం మంజూరైన గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు

మంథని నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి శ్రీధర్ బాబు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.