02-01-2026 01:07:44 AM
తుంగతుర్తి, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాలకు, శ్రీకారం చుట్టారు. దీనితో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు చేస్తున్న అభివృద్ధి పూర్తిస్థాయిలో గ్రామాల్లో విస్తరించనున్నది. జిల్లాలో ప్రస్తుతం మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కాగా, తుంగతుర్తి మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలో గాను, ప్రస్తుతం 12 గ్రామపంచాయతీలలో భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తుంగతుర్తి లో 857 సంఘాలకు గాను సుమారు 9000 మంది మహిళలు సభ్యత్వం పొంది, పొదుపు సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఉపాధి హామీ నిధులతో : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు చెట్ల కింద గతంలో సమావేశాలు నిర్వహించాల్సి వస్తుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, శాశ్వత పరిష్కారం చూపే మార్గంలో, మొట్టమొదటి సారిగా ఉపాధి హామీ నిధులతో 200 గజాల స్థలంలో, కనీసం 5502 చదరపు అడుగుల విస్తీర్ణంలో, సుమారు రూ.10 లక్షల వ్యయంతో మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భవనాల నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలకు దాతలుగా కొంతమంది ముందుకు రావడం శుభ పరిమాణం. దీంతో గ్రామాల్లోని మహిళా సంఘ సభ్యులందరూ ఒకే సమూహంలో కూర్చొని, పొదుపు సంఘాల సమావేశాలతో పాటు, అభివృద్ధిపై, ప్రణాళికలు తయారు చేసుకొని, పలుమాలు చర్చలు జరుపుకొని, రానున్న రోజుల్లో స్వయంగా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని, స్వయంగా పనులు చేసుకుని, అమ్మకాల్లో, లాభాల్లో పాలుపంచుకొనుటకు అవకాశం కలగనున్నది. దీనితో గ్రామాల్లో మహిళల అభివృద్ధి ముందుకు కొనసాగుతున్నది .
మొదట గ్రామాల్లో స్థలాన్ని సేకరించి అనంతరం సంబంధిత అధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు దాతలు ముందుకు వచ్చినట్లయితే 500 గజాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని వేర్హౌస్ గా ఏర్పాటు చేసుకో అవకాశం కలదు.
దీని నిర్మాణం పనులు కూడా మహిళా సంఘాలకే వర్తించనున్నది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యంతో, మహిళల పట్ల చూపుతున్న ఆదరణ పట్ల, సర్వత్రా మహిళల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని అన్నారం కేశవపురం గ్రామంలో ప్యాడి క్లీనర్ నిర్మా ణం కొరకు స్థలాన్ని సేకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
గామాల్లో భవనాలకు స్థల సేకరణ ప్రక్రియ జరుగుతున్నది
-తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ద్వారా 10 లక్షల వ్యయంతో గ్రామాల్లో శాశ్వత భవనాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం, చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వ స్థలాలు లేని చోట దాతలు ముందుకు రావాలని, అభిప్రాయం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణంతో మహిళల మరింత అభివృద్ధి కొనసాగనున్నది.
- అశోక్ , ఏపిఎం ఐకెపి, తుంగతుర్తి
గ్రామాల్లో మహిళా శక్తి భవనాలతో మహిళల అభివృద్ధి
ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యంతో మహిళలకు గ్రామాల్లో నేడు మహిళా సంఘాల భవనాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. దీనితో రామన్న రోజుల్లో మహిళా సంఘ సభ్యులందరూ, ఓకే గ్రామంలో ఒకేచోట కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకొని, అభివృద్ధి పనులపై చర్చించే అవకాశం కలదు. ముఖ్యమంత్రి తీసుకున్న మంచి నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
- గుండగని జమున, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు