calender_icon.png 2 January, 2026 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలి

02-01-2026 01:26:10 AM

  1. గత కేంద్ర ప్రభుత్వ పాలకుల వైఫల్యం వల్లే బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టలేదు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో వైద్య ఆరోగ్యశాఖ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సమావేశం సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వే షన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామన్నారన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవని, గతంలో పాలించిన కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిం చడం మూ లంగానే ప్రమోషన్లలలో రిజర్వేషను పెట్టలేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమీషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు.

చట్టబద్దమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పిం దని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు.

బీసీ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, వాటర్ వరక్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామరాజు, అనురాధ గౌడ్ జాతీయ బీసీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, జి. పద్మ రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు, టి. నారాయణ కార్యదర్శి, జగన్ కోశాధికారి, అనిల్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్, వేణు గోపాల్, యాదయ్య, మంజుల, చంద్రశేఖర్, వజ్ర ్మ, సురేష్, శోభ, శ్రీనివాస్, పద్మ, ప్రభాకర్, అలివేలు, వై శివానం దం, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ఆర్. కృష్ణయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీసీ నేత రాజ్ కుమార్

నూతన సంవత్సరం సందర్భంగా గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్యను బీసీ సంఘం నేత టి. రాజ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.