11-05-2025 01:44:05 AM
- పాక్ భద్రత కోసం అందులోని విద్యార్థులను వాడుకుంటాం
- పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 10: భారత్ ఉద్రిక్తతల నేపథ్యం లో తమకు సైన్యం సరిపో కుంటే మదర్సాలలో చదువుతు న్న విద్యార్థులను రంగంలోకి దింపుతామని, వారు మన దేశానికి రెండో రక్షణ శ్రేణి అం టూ పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అవసరం వచ్చినప్పుడు వంద శాతం వారిని వాడుకుంటామంటూ కుటిల బుద్ధిని బయ టపెట్టారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం కోసం, దాన్ని నిలబె ట్టుకునేందుకు తమ పౌరుల ప్రాణాలను ప ణంగా పెట్టేందు కు కూడా ఆ దేశ నాయకులు వెనకడుగు వే యడం లేదు.
పాక్ రక్ష ణ శాఖమంత్రి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నంగా నిలుస్తున్నాయి. కాగా పాక్ రక్షణమంత్రి పార్ల మెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాయక విద్యార్థులను యుద్ధానికి బలిచేస్తారా అంటూ పలువురు మండిపడుతున్నారు. విద్యాలయాల పరువుతీసేలా మాట్లాడొద్దంటూ అక్కడి వారే హెచ్చ రిస్తున్నారు.