calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ నిఘా పెంచండి దుమ్ముగూడెం, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను

24-09-2025 12:04:43 AM

ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు 

చర్ల/ దుమ్మగూడెం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పేకాట, బెట్టింగులు, కోడి పందాలు, తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అలాంటి వ్యక్తులపై చ ట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మం గళవారం ఆయన దుమ్ముగూడెం, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

నిత్యం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి స మస్యల పరిష్కారానికి కృషి చేయాలని. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీ ప్రదేశంలో ‘నేను సైతం‘ కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్దాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించి,నిత్యం అట్టి ప్రదేశాలలో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.