calender_icon.png 21 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన గోదావరి నదీ ప్రవాహం

21-08-2025 01:37:38 AM

  1. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వెంకట్రావుపల్లి గ్రామస్తుల పరామర్శ 

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి

కన్నాయిగూడెం, ఆగస్టు20(విజయక్రాంతి)ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క సాగర్ బ్యారేజ్,ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం కరకట్ట ప్రాంతాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి సందర్శించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లడం కానీ,పడవలలో నదులు దాటడం కానీ చేయకూడదని హెచ్చరించారు.అనంతరం ముంపుకు గురైన వెంకట్రావుపల్లి గ్రామస్తులను కలిసి పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకొన్నారు వరద ఉధృతి తగ్గేవరకు బయటకు వెళ్లకూడదని సూచించారు. విపత్కర  పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, డయల్ 100ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షిణ సహాయం కోసం జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు (డీపీఆర్‌ఎఫ్) బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేశారు.