calender_icon.png 29 May, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

26-05-2025 01:30:11 AM

- 4 ట్రిలియన్ డాలర్లకు చేరిన జీడీపీ

- జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

- మూడేండ్లలో జర్మనీని దాటేయనున్న ఇండియా

- నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ, మే 25: వికసిత్ భారత్ ఫలాలనిస్తోంది. భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్‌ను దాటేసి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్టు నీతిఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

‘ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో భారత్.. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే విధంగా దూసుకుపోతే భారత్ మరో మూడేండ్లలో జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.

ప్రపంచ అస్థిరత, స వాళ్లు ఉన్నా కానీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచం దృష్టిని మనం ఆకర్షించడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. అమెరికా, చైనా, జర్మనీ దేశాలు మా త్రమే మనకంటే ముందు ఉన్నాయి. దేశీయ డిజిటల్ మార్కెట్ వృద్ధికి చాలా కీలకం.’ అని బీవీఆర్ పేర్కొన్నారు. 

హర్షం వ్యక్తం చేసిన మంత్రులు

భారత వృద్ధిపై కేంద్ర మంత్రి జితేంద్ర సి ంగ్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ వై పు ఇదో పెద్ద అడుగు అని పేర్కొన్నారు. ఈ కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేండ్లలో భారత్ మూ డో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన పాలసీలతో ఇది సాధ్యమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్‌ను అధిగమించామని.. త్వరలోనే జర్మనీని కూడా అధిగమిస్తామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండేండ్లలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ కూడా అంచనావేసిందని వెల్లడించారు.