26-05-2025 01:27:20 AM
- డ్రోన్ దీదీలను మెచ్చుకున్న ప్రధాని
- ఆపరేషన్ సిందూర్‌తో భారతీయులంతా ఏకం
-122వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 25: వ్యవసాయరంగంలో డ్రోన్లు ఉపయోగించే మహిళా రైతులందరూ ‘స్కై వారియర్స్’ అని ప్రధాని మోదీ కొనియాడారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళా రైతులను ప్రత్యేకంగా అభినందిస్తూ.. వారంతా స్కై వారియర్స్ అన్నారు.
ఆదివారం 122వ మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం మోదీ పాల్గొన్న తొలి మన్‌కీబాత్ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.
దేశమంతా ఏకమైంది
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. మారుతున్న ఇండియా ముఖచిత్రం ఆపరేషన్ సిందూర్.
మన సైనికులు ప్రదర్శించిన ధై ర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వింపజేశాయి. మన దళాలు సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాయి. అందుకు భారత్‌లోనే తయారైన ఆయుధాలను ఉప యోగించాయి. ఇది హర్షించదగ్గ పరిణామం. ఈ ఆపరేషన్‌ను దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చే సింది.
అనేక కుటుంబాలు దీన్ని త మ జీవితాల్లో భాగం చేసుకున్నారు. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణా ల్లో తిరంగ యాత్రలు నిర్వహించారు. దేశ రక్షణలో పాలు పంచుకు నేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకొచ్చారు.’ అని పేర్కొన్నారు.
మన వస్తువులే కొనుగోలు చేయండి..
భారత్‌లో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని మోదీ ప్రజలను మోదీ కోరారు. మన దేశంలో తయారయిన వస్తువులు కొనుగోలు చేసి దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. భారత్‌లోని పర్యాటక ప్రాంతాల్లోనే విహరించండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదై నా పండుగలకు భారతీయ వస్తువులను, కళలకు చెందిన వస్తువులు బ హుమతిగా ఇవ్వాలని కోరారు. దేశంలో క్రమంగా సింహాల సంఖ్య పెరుగుతోందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.